రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా బాగా వెనుకబడిన జిల్లా. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాను అభివృద్ధి చేశారు. మాకు వనరులు ఉన్నాయి. అన్ని ఉన్నాయి కానీ, దురదృష్టవశాత్తు గత పాలకులు సరిగ్గా దృష్టిపెట్టలేదు. వైయస్ రాజశేఖరరెడ్డి హాయం తప్ప మిగిలిన వారు సరిగా పట్టించుకోలేదు. అని ధర్మాన ప్రసాద్ రావు మాట్లాడారు. అమ్మవడి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.... వైయస్ జగన్ సీఎం అయ్యాక ఉద్దానం ప్రాంతంలో శాశ్వత పరిష్కారం కోసం నీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇది నిజం కాదా? అని ప్రశ్నించారు. అలానే కిడ్నీ వ్యాధులపై అనేక మంది స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఐదేళ్లు పాలన చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రూ.250 కోట్లతో ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. రోగులకు డబ్బులు ఇచ్చి శాశ్వత పరిష్కారం కనుక్కోనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రిగా వైయస్ జగన్‌ను ఎంతో ఆరాధిస్తున్నారు. వంశధార ప్రాజెక్టు ప్రాణప్రదానమైంది. మీరు తీసుకున్న చర్యలతో నేరెడు బ్యారేజీ అడ్డంకులు తొలిగాయి. మా జిల్లాకు లిప్టు ఇరిగేషన్ మంజూరు చేయాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు సీఎం వైయస్ జగన్‌కు వినతిపత్రం ఇచ్చారు. రామ్మూర్తి స్టేడియాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం ఈ స్టేడియాన్ని పట్టించుకోలేదు. మహేంద్ర తనయ ప్రాజెక్టుకు వైయస్ రాజశేఖరరెడ్డి పునాదివేశారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రాజెక్టును కూడాపూర్తి చేయాలని మంత్రి కోరారు. అమదాలవలస రోడ్డు నిర్మించేందుకు నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని కోరారు. రూ.18కోట్ల పరిహారాన్ని మంజూరు చేయాలని సీఎం వైయస్ జగన్‌కు మంత్రి విజ్ఞప్తి చేశారు. సీఎం వైయస్ జగన్ చేస్తున్న పరిపాలన పద్ధతి ముందు తరాలకు ఆదర్శం. ఏ రాజనీతజ్ఞుడైనా ఇలాంటి ఆలోచన చేయాలి. గతంలో జరిగిన పొరపాట్లు వైయస్ జగన్ పాలనలో జరగవని, మీ వెంటే ఉంటామని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.