నెదర్లాండ్ కు చెందిన థిజ్ వాన్ డెర్ హిల్ట్స్ ఓ నిపుణుడు ఓ ప్రత్యేకమైన దిండును తయారు చేశాడు. నీలమణి, వజ్రాలు, బంగారం, మల్బరీ సిల్క్‌తో పాటు పలు విలువైన వస్తువులను దిండు తయారీలో వాడాడు. ఈ దిండును తయారు చేయడానికి 15 ఏళ్లపాటు కృషి చేసినట్లు తెలిపాడు. ఇది ప్రపంచంలోనే ఖరీదైన దిండు అని, దీని ప్రారంభ ధర 57వేల డాలర్లుగా (దాదాపు రూ.45 లక్షలు) ఖరారు చేశాడు. tailormadepillow.com లో ఈ వివరాలను పెట్టాడు.