మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది. ఇటు సీఎం ఉద్ధవ్ వర్గం అటు రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే ఏక్ నాథ్ షిండేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 20న ఏక్ నాథ్ షిండేను పిలిపించి ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవి ఇస్తానన్నారని అన్నారు. ఆ సమయంలో షిండే నాటాకాలడారని, నెల తర్వాత తిరుగుబాటు చేశారని ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు.