ఏదో విధంగా సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేయాలని, ప్రభుత్వానికి ఆదాయ వనరులు రాకూడదని, ప్రజలెవరూ కట్టాల్సిన పన్నులు కట్టకూడదని, మద్యంలో వస్తున్న ఆదాయం రాకూడదనే దురుద్దేశంతో టీడీపీ ప్రయత్నిస్తోంది అని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ... ప్రభుత్వానికి అప్పులు పుట్టకూడదు, ఆదాయం రాకూడదు అన్నదే ఈ దుష్ట చతుష్టయం కుట్ర. రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దంటూ ఆర్‌బీఐకి చంద్రబాబు, టీడీపీ రోజుకో లేఖ రాస్తున్నారు. అప్పులు పుట్టకూడదు, ప్రజల నుంచి పన్నులు వసూలు చేయకూడదు, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవాలి, పేద ప్రజలు నష్టపోవాలి... అన్నది వీరి దురుద్దేశం.టీడీపీ ఇలాంటి విషపూరిత ప్రచారాల ద్వారా చేస్తున్న ప్రయత్నాలు వ్యర్థం. మీరు చేసే ఇలాంటి కుట్రల వల్ల ప్రజలకు మా మీద మరింత అభిమానం పెరుగుతుందే తప్ప మా అభిమానాన్ని మీరు దెబ్బతీయలేరు. ఎన్ని కుట్రలు చేసినా ఆత్మకూరులో ఏవిధంగా గెలిచామో, వచ్చే ఎన్నికల్లో కూడా వైయస్సార్ సీపీ ఘన విజయం సాధిస్తుంది అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.