దక్షిణాఫ్రికాలోని ఈస్ట్‌లండన్ సిటీలో గల వీకెండ్ నైట్ క్లబ్‌లో 21 మంది అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతుల్లో చాలా మంది 13 ఏళ్లలోపు వారే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా పరీక్షలు అయిపోయాయని ఆనందంతో పార్టీ చేసుకుంటున్న తరుణంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మరణాలకు గల కారణాలు తెలియనప్పటికీ, తొక్కిసలాట లేదా విషప్రభావానికి గురయ్యారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa