రెబల్ ఎమ్మెల్యేలపై శివసేన పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. రెబల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం వై-ప్లస్ కేటగిరి భద్రతను కల్పించడాన్ని బట్టి వారి వెనక బీజేపీ ఉన్నట్లు అర్థమవుతోందని తమ పత్రికలో కథనం ప్రచురించింది. ఏక్నాథ్ షిండేతో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు రూ.50 కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపించింది. ఈ స్క్రిప్ట్ అంతా బీజేపీదేనని ఆరోపించింది. మరోవైపు రెబల్స్ గువాహటి క్యాంప్ నుంచి బయటకు రావడం లేదు.