అగ్నిపధ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యం. సుధాకర బాబు సోమవారం నాడు కర్నూలు జిల్లా కార్యాలయం నందు డిమాండ్ చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎస్ శైలజనాథ్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎం సుధాకర బాబు ముఖ్య అతిథిగా హాజరై మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు.