నంద్యాల జిల్లాలో నకిలీ సీడ్స్ విత్తనాలు, నకిలీ నీళ్ల మందులు సరఫరా చేస్తున్న సీడ్స్ కంపెనీల, ఫర్టిలైజర్స్ షాపు యజమానులపైన కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. నకిలీ విత్తనాల మాఫియా ద్వారా నష్టపోయిన జిల్లా రైతాంగాన్ని ఆదుకోకపోతే ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తాం అని జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ డిమాండ్ చేశారు.