ఎల్లెల్సీ పరిధిలోని సూగురు మేజరు కింద 4 కిలోమీటర్ల నుండి 8. 6 కిలోమీటర్ల వరకు ప్యాచింగ్ వర్క్స్ జరుగుతున్నట్లు ఇరిగేషన్ శాఖ జేఈ రంగస్వామి మంగళవారం విలేకరులకు తెలిపారు. మెయింటెనెన్స్ గ్రాండ్ కింద రూ. 16 లక్షల రూపాయలు విడుదలైనట్లు తెలిపారు. సూగురు మేజరు నుండి సింగరాయన హళ్లి వరకు ప్యాచింగ్ వర్క్స్ తో పాటు కాలువపై రహదారికి గ్రావెల్ వేసే పనులు వర్క్ ఇన్ స్పెక్టర్ ఓబులేషు, లస్కరుల పర్యవేక్షణలో జరుగుతాయన్నారు.