ఆదోని మండలం మదిరెలో తాగు నీటి సమస్య పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం గ్రామస్తులు సచివాలయం ఎదుట ధర్నా చేశారు. సీపీఎం నాయకులు లింగన్న మాట్లాడుతూ రెండు నెలలుగా తాగు నీటి సరఫరా సక్రమంగా లేదన్నారు. డబ్బులు పెట్టి నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. మదిరె గ్రామానికి ట్యాంకర్ ద్వారా తాగు నీరు అందించాలని కోరారు. సచివాలయం అధికారి వినతి పత్రం అందించారు.