మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో జులై 1 నుండి జొన్న మరియు పసుపు ఉత్పత్తులను గిట్టుబాటు ధరతో కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని నంద్యాల జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ నాగరాజును ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో రైతులు పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.