భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య మంగళవారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచిన భారత్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ గెలవాలని చూస్తోంది. ఈ మ్యాచ్ లోనైనా విజయం సాధించాలని ఐర్లాండ్ భావిస్తోంది.
ఈ మ్యాచ్ లో టీమిండియాలో భారీగా మార్పులు చేసే అవకాశం ఉంది. గత కొన్ని మ్యాచ్ లుగా బెంచ్ కే పరిమితమైన హర్షదీప్, సంజూ శాంసన్, రవి బిష్ణోయ్ ఈ మ్యాచ్ లో ఆడే ఛాన్సుంది. రాత్రి 9గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.