ఉడకబెట్టిన మెంతికూర ఆకులు అజీర్ణాన్ని పోగొడతాయి. కీళ్ళనొప్పులను నయం చేస్తుంది. రక్తహీనతను నివారిస్తాయి. శ్వాసక్రియలోని అవరోధాలు సరిచేస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కీలకమవుతాయి.
ఒక గుప్పెడు మెంతి ఆకులను పరోటాలలో, చట్నీలలో, టమాటో కూరలో వేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వారంలో మూడునాలుగు సార్లు మెంతి కూర తీసుకుంటే ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి.