రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేట వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై వెళ్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ధవలేశ్వరం గ్రామానికి చెందిన జయదేవ్ గణేష్, వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందారు. గత అర్ధరాత్రి స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నట్లు సమాచారం. కుమారుల మృతితో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa