స్టాక్ మార్కెట్లు లాభాలతో నడిచి చాలా రోజులు అవుతోంది. గత వారం రోజులుగా అధిక రోజులు నష్టాలతోనే ముగిసింది. తాజాగా నిన్నటి రోజు స్వల్ప లాభాలను స్టాక్ మార్కెట్లు మూటగట్టుకున్నాయి. నేడు నష్టాలతోనే ముగిశాయి.
రిలయన్స్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, సన్ ఫార్మా సంస్థల షేర్లు లాభాలను సాధించాయి. అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ లైఫ్ వంటివి నష్టాలతో వెనుదిరిగాయి.