ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై మంత్రి మేరుగ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. దళితులు, గిరిజనులను వేధించకూడదని అగ్రవర్ణాల వారికి, తప్పుడు కేసులు పెట్టకూడదని ఎస్సీ, ఎస్టీలకు అవగాహన కల్పించాలన్నారు. తహశీల్దార్లు, ఎస్సైలు వారానికి ఓసారి గ్రామాల్లోకి వెళ్లి ప్రజల్ని చైతన్య పరచాలన్నారు. ఈ చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో అతి తక్కువ శాతం నిందితులకు మాత్రమే శిక్షలు పడుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలు ఏర్పడినందున అన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కేసులను విచారించే డీఎస్పీలను నియమించాలన్నారు. ఈ సమావేశంలో సీఐడీ పీసీఆర్ ఎస్పీ రత్న, జేడీ ప్రాసిక్యూషన్ అజయ్‌కుమార్ పాల్గొన్నారు.