చైనా స్పేస్‌క్రాఫ్ట్ టియాన్వెన్-1 ఆర్బిటర్, మార్స్ గ్రహంపై అద్భుతాలు నమోదుచేసింది. మార్స్ పూర్తి చిత్రాన్ని తీసి చైనా స్పేస్ ఏజెన్సీకి పంపించింది. ఈ ఫొటో తీసేందుకు మార్స్ చుట్టూ ఏడాదిపాటు1,344 సార్లు తిరిగిందని ఏజెన్సీ తెలిపింది. తాజాగా టియాన్వెన్ 1 పంపిన ఫొటోలో లోయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, మార్స్‌పై నీటి జాడలు ఉన్న ప్రాంతాన్ని ఆర్బిటర్ గుర్తించిందని, నీళ్లు మొత్తం ద్రవరూపంలోనే ఉన్నట్టు చెప్పింది.