కర్ణాటకలోని కలబురగిలో దారుణం జరిగింది. లక్ష్మీకాంత్(34) అనే ఆటో డ్రైవర్ తన ఇద్దరు కూతుళ్లు సోని(10), మయూరి(8) లను గొంతు నులిమి చంపేశాడు. ఆయన భార్య అంజలి 4 నెలల క్రితం ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో లక్ష్మీకాంత్ మద్యానికి బానిసయ్యాడు. వారి నలుగురు పిల్లలు అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు. లక్ష్మీకాంత్ తన పిల్లల్ని చూడడానికి మంగళవారం అత్తారింటికి వెళ్లాడు. సోని, మయూరిలను బయటకు తీసుకెళ్లి చంపేశాడు.