ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో లేవని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మూడేళ్లలో 95 శాతం హామీలను నెరవేర్చిన ఏకైక సీఎం వైయస్ జగన్ అని స్పష్టంచేశారు. మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చి జనంలోకి వెళ్తున్నామన్నారు. భవిష్యత్ ప్రణాళికపై చర్చించేందుకే ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దుష్టచతుష్టయం ఎన్ని కుట్రలు చేసినా ఫలితం ఉండదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు మోసాలు తప్ప త్యాగాలు చేయలేదని ధ్వజమెత్తారు. ఎవరినో సీఎంను చేసేందుకు పెట్టిన పార్టీ జనసేన అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎంతమందిని కలుపుకొచ్చినా ఎన్నికల్లో భంగపాటు తప్పదని, సంక్షేమ సైనికుల అండతో మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.