ఎమ్మిగనూరు పట్టణంలోని 4 నుండి 10 వార్డులు అలాగే 13, 16, 17, 18, 33, 34 వార్దులలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బోయ రామాంజనేయులు, రాముడు డిమాండ్ చేశారు.
గురువారం మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో 10 రోజులు పాటు జనం కోసం సిపిఎం కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నామన్నారు.