గత నెలరోజులుగా వర్షం కోసం పూజలు, ప్రార్థనలు చేసినా మొహం చాటేసిన వరుణుడు గురువారం ఎట్టకేలకు ఆదోనిపై కరుణించాడు. ఇంత కాలం వేడెక్కిన వాతావరణం వర్షం పలుకరింపుతో చల్లబడింది.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు అయినప్పటికీ వర్షంలేక రైతులు దిగాలుగా ఉన్నారు. గురువారం ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురవడంతో రైతుల కళ్లలో ఆనందం వెల్లువిరిసింది.