రానున్న విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకొని జగనన్న విద్యాకానుకలో భాగంగా గురువారం కోవెలకుంట్లలోని ఎమ్మార్సీ కార్యాలయంలో పాఠ్య పుస్తకాలను ఎంఈఓ శ్రీధర్‌రావు ఆయా పాఠశాలల హెచ్ఎంలకు పంపిణీ చేశారు.
తొలి విడతగా మండలానికి మంజూరైన పాఠ్యపుస్తకాలను ఆయా పాఠశాలలకు ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు అందజేశామని ఆయన చెప్పారు. పాఠశాలల ప్రారంభం కంటే ముందుగానే విద్యాకానుక కిట్లను అందజేయనున్నట్లు పేర్కొన్నారు.