గుంతకల్లు: పట్టణంలోని రామస్వామి వీధిలో నివాసముంటున్న సప్లైయర్స్ షాపు నిర్వాహకుడు శ్రీనివాసులు అనే వ్యక్తి ఇంటిలో చోరీ జరిగింది. అతడు సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి ధర్మస్థలం తీర్థయాత్రకు వెళ్ళాడు. గురువారం తిరిగి ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించాడు. రెండు తులాల బంగారం, రూ.3 లక్షల నగదు చోరీ గురైందని గుర్తించాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామసుబ్బయ్య తెలిపారు.