కనిగిరి: పట్టణంలో శుక్రవారం నుంచి ప్లాస్టిక్ వినియోగించినా, విక్రయించినా చట్టరీత్యా చర్యలు తప్పవని స్థానిక ఇన్ ఛార్జ్ కమిషనర్ లావణ్య అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పట్టణంలో 75 మైక్రాన్ల లోపు మందం కలిగిన అన్ని రకాల ప్లాస్టిక్ కవర్లు నిషేధించామన్నారు. నేటి నుండి నిషేధం పూర్తిస్థాయిలో అమలు అవుతుందని, ఎవరైనా విక్రయించినా, వినియోగించినా జరిమానా విధించనున్నట్లు తెలిపారు.