పోలవరం ప్రాజెక్ట్ కి సంభందించి డయాఫ్రమ్ వాల్ అనేది ఇప్పటికి కూడా ఎంత మేర దెబ్బ తిన్నది అన్నది అర్ధం కావడం లేదు. ఎందుకంటే అది భూగర్భంలో 100 మీటర్ల లోతులో ఉంటుంది. దాన్ని ఎక్కడెక్కడి నుంచో నిపుణులు వచ్చి చూస్తున్నారు. అయినా దాని గురించి ఎవరూ చెప్పలేకపోతున్నారు అని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అయినా ప్రభుత్వాన్ని నిందిస్తున్న చంద్రబాబు, డయాఫ్రమ్ వాల్ ఎప్పుడు, ఎలా కూలిపోయిందో కూడా ప్రభుత్వం గుర్తించలేకపోతోందని విమర్శిస్తున్నారు. డయాఫ్రమ్ వాల్‌ను, చుట్టూ ఉన్న కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేయకుండా కట్టారు. కనీసం కాఫర్ డ్యామ్‌ను కట్టకుండా వదిలేసినా, నీరు నేరుగా వెళ్లిపోయేది. కానీ మధ్యలో రెండు చోట్ల కాఫర్ డ్యామ్‌ను వదిలేశారు. అక్కడ అవి ఎందుకు పూర్తి చేయలేదు అంటే.. అవి ఒకవేళ పూర్తి చేసి ఉంటే, 35 కాంటూరులో నీరు చేరుతుంది. దీంతో ఆ పరిధిలో ఉన్న గ్రామాలు మునిగిపోతాయి. దీన్ని గమనించి ఆయా గ్రామాల వారు వెంటనే పీపీఏ వద్ద మొర పెట్టుకోగా, వెంటనే వారిని ఖాళీ చేయించమని చెబితే, ఆ పని చేయలేదు. కానీ డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసి, కాఫర్ డ్యామ్‌కు రెండు చోట్ల గండ్లు పెట్టారు. దీంతో నీరు నాజిల్ ఫోర్స్‌తో వేగంగా ప్రవహించి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. అసలు కాఫర్ డ్యామ్ కట్టకపోయి ఉన్నా, అది కొట్టుకుపోయేది కాదు.ఇవన్నీ చంద్రబాబుకు తెలుసు. అయినా ప్రభుత్వంపై బుదర చల్లుతున్నారు అని ఆరోపించారు.