రాబోయే రోజులలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంచార్జీ తిక్కారెడ్డి సహకారంతో సమస్యలను పరిష్కరిస్తానని టీడీపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు, ఎంపీటీసీ శశిరేఖ భరోసా ఇచ్చారు. శుక్రవారం రాత్రి హనుమాపురం గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.
హనుమాపురం తనకు పుట్టినిల్లు వంటిదని, మీ పట్టాల సమస్య తప్పకుండా తీరుస్తానని స్పష్టం చేశారు. హనుమాపురంలో వైసీపీ నేతల కుట్రలు సాగవన్నారు.