పాణ్యం: గడివేముల మండలంలోని తిరుపాడు గ్రామానికి చెందిన నాగవేణి రైతు భరోసా డబ్బులు పడలేదని గ్రామ వాలంటీర్ బాల మద్దిలేటి వద్దకు వెళ్ళగా అదే అదునుగా భావించి విడతల వారిగా ఆమెతో బయోమెట్రిక్ ముద్రలు వేయించుకుంటూ ఆమెకు తెలియకుండా ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ. 70 వేలు విత్ డ్రా చేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు నాగవేణి శుక్రవారం గడివేముల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.