మనదేశంలో చాలావరకు సోషల్ మీడియా దుర్వినియోగం అవుతోందని చెప్పడానికి తాజాగా వాట్సాప్ తీసుకొన్న నిర్ణయంతో తేలిపోతోంది. మెటా సారథ్యంలోని మెసెజింగ్ యాప్ వాట్సాప్ మే నెలలో 19 లక్షలకుపైగా భారతీయ అకౌంట్లను నిషేధం విధించింది. గత ఏడాది అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నియమాలను పాటించకపోవడంతో బ్యాన్ చేసినట్టు వాట్సాప్ ప్రకటించింది. వాట్సాప్ గ్రీవెన్స్ మార్గం నిబంధనల అతిక్రమణలను గుర్తించే సొంత వ్యవస్థల ద్వారా యూజర్ల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మే నెల యూజర్-సేఫ్టీ నివేదికలో వాట్సాప్ ప్రతినిధి వెల్లడించారు. ఆ రిపోర్ట్ ప్రకారం మే నెలలో వాట్సాప్ 1.9 మిలియన్లకు పైగా ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్ ప్రతినిధి తెలిపారు.
వాటిపై తీసుకున్న చర్యలు గురించి నివేదికలో వెల్లడించారు. యూజర్ల నుంచి నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ అందిన తర్వాత చర్యలు తీసుకున్నాన్నారు. "సంవత్సరాలుగా మేము మా ప్లాట్‌ఫారమ్‌లో మా వినియోగదారులను సురక్షితంగా ఉంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక సాంకేతికత, డేటా శాస్త్రవేత్తలు, నిపుణులు, వివిధ ప్రక్రియలపై పెట్టుబడి పెట్టాం" అని ప్రతినిధి తెలిపారు.
అంతేకాదు తాము నివారణపై దృష్టి సారించామని, హాని జరగక ముందే దానిని గుర్తించడం మంచిదని నమ్ముతున్నట్టు చెప్పారు. ఇదిలాఉండగా ఏప్రిల్ నెలలో కూడా 16 లక్షల అకౌంట్లను, మార్చిలో 18.05 లక్షల ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. కంప్లైట్‌ను బట్టి కొన్ని అకౌంట్లపై బ్యాన్ విధించామని, గతంలో బ్యాన్ చేసిన వాటిని పునరుద్ధరించామని వెల్లడించారు. కాగా గత ఏడాది కొన్ని నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వాటి ప్రకారం 50 లక్షలకుపైగా యూజర్లను కలిగి ఉన్న డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నెలవారీగా ఫిర్యాదుల వివరాలను ప్రకటించారు.