హిందుత్వ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్, ఎన్సీపీలతో ఉద్ధవ్ థాకరే చేతులు కలిపారంటూ ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందిస్తూ... హిందుత్వ సిద్ధాంతం కోసం షిండే తిరుగుబాటు చేయలేదని... అధికారం కోసం ఆ పని చేశారని విమర్శించారు. మరోవైపు, శివసేనకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు షిండేతో పాటు బయటకు వచ్చేశారు. దీంతో, తన సొంత పార్టీ (శివసేన)లో ఉద్ధవ్ థాకరే మైనార్టీగా మిగిలిపోయారు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని చెప్పడానికి ఇది మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు.