మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని దేశాయ్నగర్లో ఓ వివాహితకు రైల్వే ఉద్యోగితో వివాహమైంది. వారికి 5 ఏళ్ల కుమారుడు, 2 ఏళ్ల కుమార్తె ఉన్నారు. సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడి కోసం భర్త నుంచి ఇటీవల విడాకులు తీసుకుంది. తాజాగా పిల్లలను ఓ ఆసుపత్రి వద్ద రోడ్డుపై వదిలి, నాన్న వస్తాడని వారికి చెప్పింది. అక్కడి నుంచి ప్రియుడితో పారిపోయింది. పిల్లలిద్దరూ తల్లి కోసం ఏడుస్తుండడంతో స్థానికులు చేరదీశారు.