గ్రామాల్లో బొడ్రాయిని ఊరి మధ్యలోనే ఎందుకు ప్రతిష్టిస్తారని నేటితరానికి అవగాహన ఉండకపోవచ్చు. మానవ శరీర మధ్యభాగంలో ‘నాభి’లాగా.. గ్రామానికి బొడ్రాయి మధ్య భాగంగా ఉంటుంది. అందుకే దీనిని బొడ్డురాయి అని పిలుస్తారు. పూర్వం గ్రామస్తులకు ఊరి నిర్మాణంపై అవగాహన కల్పించడం, ప్రజల్లో ఐక్యమత్యం ఏర్పాడాలనే ఉద్ధేశ్యంతో బొడ్రాయిని ప్రతిష్టించి, ఏటా వార్షికోత్సవాలు నిర్వహించేవారు. నేటికి అది ఆనవాయితీగా కొనసాగుతుంది.