బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ అధ్యక్ష అభ్యర్థి ద్రౌపది ముర్ము జూలై 4, సోమవారం రాంచీలో పర్యటించనున్నారు. ద్రౌపది ముర్ము మద్దతు కూడగట్టేందుకు అన్ని పార్టీల నాయకులను కలుస్తారు.జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్న ద్రౌపది ముర్ము జార్ఖండ్ మాజీ గవర్నర్‌గా పనిచేసిన ముర్ము రాంచీలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించనున్నారు.జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అమిత్ షాతో భేటీ తర్వాత ఎన్డీయే రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థికి మద్దతుపై నిర్ణయం తీసుకోనున్నారు.