దేశవ్యాప్తంగా కరోనా కేసుల నమోదు సంఖ్య తగ్గింది. గత 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 13,086 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇటీవల కాలంలో రోజుకు 16 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా బారిన పడిన వారిలో సోమవారం 24 మంది ప్రాణాలు విడిచారు. అయితే కరోనా మహమ్మారి సోకిన వారిలో 12,456 తాజాగా కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. మరో వైపు దేశంలో కరోనా యాక్టిక్ కేసుల సంఖ్య 1,14,475కు చేరింది.