మాంసాహార పదార్థాలైన చికెన్, మటన్, చేపల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. పాలలోనూ ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ క్రమంలో మాంసాహారం తిన్న వెంటనే పాలు తాగడం వల్ల మన శరీరంలోకి పెద్ద సంఖ్యలో ప్రోటీన్లు చేరుతాయి. ఫలితంగా శరీరంలో, కీళ్లలో యూరిక్ యాసిడ్ పేరుకుపోయి అది క్రిస్టల్స్‌గా మారుతుంది. ఇది గౌట్ తదితర వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక మాంసాహారం తిన్న వెంటనే పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదికాదు.