నాసా, స్పేస్, ఏలియన్స్ వంటి విషయాలపై మీకు ఇంట్రెస్ట్ ఉందా..? అయితే ఇప్పుడు మీలాంటి వాళ్ల కోసమే నాసా ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. అంగారక గ్రహంపై మేఘాలను గుర్తించేందుకు తమతో కలిసి వర్క్ చేసేందుకు సామాన్య ప్రజలకు ఆహ్వానించింది. ఈ ప్రొగ్రామ్‌కు క్లౌడ్ స్పాటింగ్ ఆన్ మార్స్ అనే పేరు పెట్టింది నాసా. మార్స్ పై వాతావరణం భూమికంటే ఎందుకు 1% మందంగా ఉందో తెలుసుకునేందుకు నాసా ప్రయత్నిస్తుంది.