స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం అంతర్జాతీయ మార్కెట్ 250 పాయింట్లకు పైగా పెరిగింది, నిఫ్టీ 15900కిఎగువకు చేరింది. ప్రస్తుతం సెన్సెక్స్ 459 పాయింట్ల లాభంతో 53694 వద్ద నిఫ్టీ 135పాయింట్లు ఎగిసి 15970వద్ద ట్రేడ్ అవుతున్నాయి. చైనా వస్తువులపై అమెరికా కొన్ని సుంకాలను తగ్గించవచ్చని నివేదికలు, అమెరికా, ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి.