నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమస్యల పరిష్కారం కోసం తనదైన పంథాను ఎంచుకొన్నారు. సమస్య పరిష్కారానికి ఆయన మరోసారి వినూత్నంగా నిరసన తెలియజేశారు. నెల్లూరు పరిధిలోని ఉమ్మారెడ్డిగుంటలో ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన చేపట్టారు. మురికి కాలువలో దిగి ఆందోళనకు దిగారు. కొన్నాళ్లుగా ఉమ్మారెడ్డిగుంటలో మురికికాల్వ సమస్య ఉందన్నారు. రైల్వే, కార్పొరేషన్ అధికారుల తీరు బాగోలేదని.లిఖితపూర్వక హమీ ఇచ్చి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నిరసన ఆయన టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ చేపట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇదే మురికి కాలువలోకి దిగారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడలేక కాల్వలోకి దిగి నిరసన తెలిపారు.
రైల్వే, నగర కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రతిపక్షమైనా, అధికారపక్షమైనా సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేస్తానని, ఎప్పటిలోపు పనుల ప్రారంభిస్తారో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతవరకు కాల్వ దగ్గర నుంచి కదలబోనని అక్కడే కూర్చున్నారు. ఇచ్చిన గడువులోపు సమస్య పరిష్కారం కాకపోతే మురుగునీటిలోనే పడుకుంటానని హెచ్చరించారు. వెంటనే అధికారులు ఈనెల 15న నిర్మాణ పనులు ప్రారంభించి.. వచ్చే నెల 15లోపు పూర్తిచేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో శ్రీధర్ రెడ్డి తన ఆందోళనను విరమించారు.
ఇదిలావుంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇదే మురికి కాలువలోకి దిగారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడలేక కాల్వలోకి దిగి నిరసన తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ చాణక్యపురి వద్ద ఉన్న వరద కాలువపై బ్రిడ్జి నిర్మించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద కాలువపై బ్రిడ్జి నిర్మించి ప్రజల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గంట పాటు మురుగు కాలువలోనే నిల్చోగా.. చివరకు అధికారులు వచ్చి హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. మరోసారి ఇప్పుడు కాలువలోకి దిగారు.