వంటకాల రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి మెంతులు ఎంతగానో మేలు చేస్తాయి. మెంతుల్లో ఉంటే ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్, రాగి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మాంగనీసుతో పాటు ఎ, బి6, సి, కె విటమిన్లు ఆరోగ్యాన్ని కాపాడటంలో తోడ్పడతాయి. రక్తంలో గ్లూకోజు మోతాదులు తగ్గటానికీ మెంతులు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వేడి నీటిలో 10 నిమిషాల సేపు మెంతులను వేసి మూతపెట్టి, తర్వాత వడగట్టి తాగొచ్చు.