ఇండియన్ నేవీలో అగ్నివీర్ సైలర్ పోస్టుల్లో 20 శాతం మంది మహిళలు ఉండనున్నారు. అగ్నిపథ్ పథకం అమల్లోకి వచ్చిన తరువాత మొదటి బ్యాచ్లో 3,000 మంది సైలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మహిళలకు అవకాశం కల్పిస్తున్నట్టు నేవీ అధికారులు మంగళవారం తెలిపారు. ఈ పోస్టుల కోసం 10వేల మంది మహిళలు తమ పేర్లను రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. దరఖాస్తులను ఈ నెల 15-30 మధ్య ఆన్లైన్లోనే పరిశీలన జరుపుతామని తెలిపారు.