టీడీపీ తన భక్తుల కోసం మరోసారి ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తెస్తోంది. తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. స్వామివారి దర్శనానికి సంబంధించి టికెట్లు విడుదల చేస్తోంది. బుధవారం 12, 15, 17 తేదీలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. అలాగే గురువారం ఉదయం 9 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చెయ్యనుంది. అలాగే శుక్రవారం సెప్టెంబర్ మాసంకు సంబంధించిన వసతి గదులు కోటాను విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఈ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
తిరుమల తిరుపతి దేవస్థానాల అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. టీటీడీ అర్చకస్వాములు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం, సాంప్రదాయ బద్దంగా కళ్యాణాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎన్‌ఆర్టీఎస్ టీటీడీ, ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలను సమన్వయం చేసుకుని కళ్యాణోత్సవం నిర్వహణలో పాలు పంచుకుంటోంది. అశేష సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించి తరించారు.కళ్యాణోత్సవం అనంతరం భక్తులందరికీ ప్రసాదం పంపిణీ చేశారు. శ్రీవారి కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు.