దేశవ్యాప్తంగా బుధవారం వంట గ్యాస్ ధర పెంచడంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తీవ్రంగా ప్రతిస్పందించారు. 'దేశంలో నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, భారతీయులు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎల్పీజీని కొనుగోలు చేస్తున్నారు.
పేదల వంటగది మళ్లీ పొగతో నిండిపోతోంది.' అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగా 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.50 మేర ధరను ఇంధన సంస్థలు పెంచాయి.