కోసిగి: కోసిగి మండల పరిధిలోని దుద్ది రిజర్వాయర్ లో ఎర్రమట్టి తవ్వకాలను తక్షణమే అరికట్టాలని దుద్ధి రైతులు బుధవారం సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.
కోసిగి సమీపంలో ఉన్న ఉరుకుంద - జుమ్మాలదిన్నె రోడ్డు నిర్మాణానికి దుద్ది రిజర్వాయర్ లోని మట్టిని ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా తరలిస్తున్నారని రైతులు వాపోయారు. మట్టిని తరలిస్తున్న కంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa