భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో నేడు తొలి మ్యాచ్ జరగనుంది. సౌతాంఫ్టన్ లోని ది రోజ్ బౌల్ స్టేడియంలో రాత్రి 10:30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. కరోనా నుంచి కోలుకున్న రోహిత్ శర్మ ఈ సిరీస్ లో ఆడనున్నాడు. మంచి ఫామ్ లో ఉన్న ఇంగ్లాండ్ ను ఓడించాలంటే భారత ఆటగాళ్లు సమిష్టిగా రాణించాలి. రోహిత్ కెప్టెన్సీకి ఈ సిరీస్ లో అసలైన పరీక్ష ఎదురుకానుంది.