ఏపీ ప్రభుత్వం త్వరలో ఈ-స్టాంప్ డ్యూటీ విధానాన్ని తీసుకురానుంది. దీంతో ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, ఇతర ఛార్జీలను ప్రజలు సులభంగా చెల్లించవచ్చు. స్టాంప్ వెండర్లు, గ్రామ, వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లలో ఆన్ లైన్ చార్జీలను కట్టించుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా కొందరు స్టాంప్ వెండర్ల వద్ద దీనిని అమల్లోకి తేనున్నారు.