సపోటా పండ్ల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గింజలను తీసివేసిన ఈ పండ్లను సలాడ్లు, మిల్క్ షేక్‌లు, జ్యూస్‌లలో ఎక్కువగా వాడుతారు. ఈ పండ్లలోని విటమిన్ ఏ, సీ వంటివి ఉన్నాయి. ఇవి మన కళ్లకు మేలు చేకూరుస్తాయి. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. బాడీలో విష వ్యర్థాల్ని సపోటాలు బయటకు పంపుతాయి. వివిధ పనుల్లో అలసిన వాళ్లు ఈ పండ్లు తింటే అద్భుత ఎనర్జీ లభిస్తుంది.