సత్యసాయి: టిడిపిలో దళితులు ఎదుగుతుంటే ఈరన్న ఓర్చుకోవటం లేదని, తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. గురువారం వారు మాట్లాడుతూ సత్యసాయి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా గుడిబండ మండలానికి చెందిన మంజునాథ్ ను నియమించడం పట్ల మీకెందుకు అంత అసూయ అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు మడకశిర పట్టణంలోని విశ్రాంతి భవనంలో గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.