ఒంగోలు: గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర జరిగే రాష్ట్ర వైసిపి ప్లీనరీ సమావేశం దృష్ట్యా ప్రకాశం, బాపట్ల జిల్లాలలో వాహనాలను దారి మళ్లించినట్టు గురువారం బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ తెలిపారు.
కోల్కతా వైపు వెళ్లే వాహనాలు ఒంగోలు త్రోవగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ నుండి చీరాల, బాపట్ల, కర్లపాలెం పెనుమూరు బ్రిడ్జి మీదుగా కృష్ణాజిల్లాకు చేరుకోవాలన్నారు.