కారంచేడు: మండలంలోని పలు గ్రామాల్లో దేవాదాయ శాఖ వారి ఆధీనంలో ఉన్న భూములకు బుధవారం కౌలు వేలంపాట నిర్వహించారు. గతంలో అప్పటి దేవాదాయశాఖ అధికారులు ఈ వేలం పాటలను బహిరంగంగా నిర్వహించకుండా తమకు ఇష్టమైన వారికి నామమాత్రపు ధరకు కౌలుకు ఇచ్చేసేవారు.
కొత్త ఈవో జ్యోతి మాత్రం తిమిడిదపాడు, ఆదిపూడి గ్రామాల లోని దేవాలయ భూములకు ఈ ఏడాది వేలం పాటలు నిర్వహించడంతో ఆదాయం లభించింది.