వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీకి గురువారం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ శ్రేణులు తరలివెళ్లారు. ఈనెల 8, 9 తేదీల్లో గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ప్లీనరీ జరగనున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు నగరంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ప్రత్యేక బస్సులు, వాహనాలలో గుంటూరుకు తరలివెళ్లారు.