నాడు - నేడు పేరుతో చేస్తున్న పబ్లిసిటీకి రియాలిటీకి ఎంత తేడా ఉందో చూడండి అని నారా లోకేష్ ఒక స్కూల్ లోని పిల్లల ఆవేదన వీడియో షేర్ చేస్తూ మాట్లాడారు. నాడు నేడు లో భాగంగా కొన్ని పాఠశాలలను మెర్జ్ చెయ్యడం ద్వారా చిన్న పిల్లలు వర్షాకాలంలో తెలియని, దూర ప్రాంత బడికి ఎలా వెళ్తారు అని ప్రశ్నించారు. అలానే టీచర్స్ కొరతతో ఉన్న బదులు కొన్ని. అందులో పాడేరు మండలం, సలుగు పంచాయతీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకి ఉపాధ్యాయుడిని పంపాలని గిరిజన చిన్నారులు వేడుకోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరం. విద్యా వ్యవస్థని నాశనం చేస్తూ తీసుకుంటున్న నిరంకుశ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. అన్ని పాఠశాలల్లో విద్యార్థులు - ఉపాధ్యాయుల నిష్పత్తి పాటించాలి అని లోకేష్ డిమాండ్ చేసారు.